కోహ్లీ.. అనుష్కల ఎంగేజ్ మెంట్ ఫిక్స్

కోహ్లీ.. అనుష్కల ఎంగేజ్ మెంట్ ఫిక్స్

పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అయ్యిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తుంటే ఇది నిజమన్న భావన కలుగుతోంది. కొత్త సంవత్సరం తొలిరోజునే ఈ జంట ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అయినట్లుగా చెబుతున్నారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ మధ్యలో ఖాళీ లభించటంతో ఈ జంట డెహ్రాడూన్ లో కలిసి ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

వెకేషన్లో గడుపుతున్నట్లుగా అందరూ అనుకుంటున్నప్పటికీ.. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అయ్యిందని.. ఆ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారన్నది లేటెస్ట్ సమాచారం. విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మల (రెండు పేర్లను కలిపి షార్ట్ కట్ లో ‘‘విరుష్క’’) ఎంగేజ్ మెంట్ కు ప్రముఖులు హాజరు కానున్నట్లుగా చెబుతున్నారు. రిషికేష్ లో వీరి ఎంగేజ్ మెంట్ జరగనున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే బిగ్ బి అమితాబ్ దంపతులు.. అంబానీ దంపతులు.. ఇలా ప్రముఖులంతా చేరుకోవటం చూస్తుంటే విరుష్క ఎంగేజ్ మెంట్ జనవరి 1 అన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఇంత జరుగుతున్నా.. ఎంగేజ్ మెంట్ విషయంపై విరుష్కలు రియాక్ట్ కాలేదు. అధికారికంగా కన్ఫర్మ్ చేయకపోవటం గమనార్హం. ఇదిలా ఉంటే.. హరిద్వార్ సమీపంలోని పతరి గ్రామంలోని అనంత్ ధామ్ ఆశ్రమంలో అనుష్క శర్మ ప్రత్యేక పూజలు చేయటం కనిపిస్తోంది. మరి.. ఇదంతా వెకేషన్లో భాగంగా సాగుతున్న ప్రోగ్రామా? లేక.. ఎంగేజ్ మెంట్ ముందు జరుగుతున్న కసరత్తా అన్నది తేలాల్సి ఉంది.

Leave a Reply