కోహ్లీ మరో రికార్డ్‌తో కెప్టెన్‌గా టాప్‌లో నిలిచాడు…

కోహ్లీ మరో రికార్డ్‌తో కెప్టెన్‌గా టాప్‌లో నిలిచాడు..  భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఓ సూపర్ శక్తిగా మారాడు. టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న విరాట్ రికార్డులను అవలీలగా సాధించుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలో భారత టెస్ట్ కెప్టెన్లందరినీ కూడా వెనక్కు నెట్టేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో 15వ సెంచరీ చేసిన కోహ్లీ కెప్టెన్‌గా 8వ, ఒకే కాలెండర్‌ ఇయర్‌లో 4వ సెంచరీ చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 146 పరుగులతో నాటౌగ్‌గా నిలిచి ప్రత్యర్ధులకు సవాల్ విసిరాడు. అయితే ఈ క్రమంలో ఒకే కాలెండర్ ఇయర్‌లో అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా అవతరించాడు. 2016లో కోహ్లీ ఇప్పటివరకూ మొత్తంగా 1112 పరుగులు చేశాడు. అంతకుముందు వరకూ రాహుల్ ద్రవిడ్ 1095 పరుగులతో టాప్‌లో ఉండేవాడు. ద్రవిడ్ ఈ పరుగులను 2006లో చేశాడు.

Leave a Reply