చంద్రబాబు జపం చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు…..

టీమిండియా ఆటగాళ్ళు ఏంటీ చంద్రబాబు జపం చేయడం ఏంటి అనుకుంటున్నారా? నిజమే టీమిండియా ఆటగాళ్ళు ఇప్పుడు చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.మొన్నటికి మొన్న టీం ఇండియా కెప్టెన్ ధోని, రైనా,రోహిత్ చంద్రబాబు అంటేనే అభివృద్ధి,అభివృద్ధి అంటేనే చంద్రబాబు అన్నట్లుగా మాట్లాడారు.దీని బట్టి అర్ధం అవుతుంది కదా చంద్రబాబు వ్యవహార తీరు.మాటల్లోనే కాదు చేతల్లో కుడా అయన నిరుపిస్తున్నాడు .అప్పటి హుదూద్ రూపంలో ఎంతో నష్టపోయిన వైజాగ్ ని చెప్పిన విధంగానే ఒక్క సంవత్సర కాలంలో పచ్చగా చేసి చూపించారు.రాష్ట్రానికి సంబంధించిన ఏ అభివృద్ధి పని అయినా సరే ఇక్కడే మీటింగ్ పెడుతున్నారు.కాబట్టి అధికారులు కూడా నగరాన్ని పచ్చగా ,స్వచ్చంగా,పరిశుభ్రంగా ఉంచుతున్నారు.

ఆ తరువాత IPL టీ ట్వంటీ మ్యాచ్ కోసం నగరంకి చేరుకున్న హర్భజన్ సింగ్ అక్కడున్న పరిస్థితులు చూసి ఆశ్చర్య పోయారు. తక్కువ కాలంలో ఇంత అభివృద్ధి ఎలా సాధ్యమని షాక్ అయిన ఆటగాళ్ళు అసలు ఏమైందో తెలుసుకుని చంద్రబాబుని పొగడకుండా ఉండలేకున్నారు.హర్భజన్ రోహిత్ శర్మ,రైనా వంటి ఆటగాళ్ళు తమ పేస్ బుక్,ట్విట్టర్ లలో వైజాగ్ అందాన్ని,అభివృద్దిని, పరిశుభ్రత గురించి గొప్పగా పొగుడుతూ తమ మనసులోని మాటలు వ్యక్త పరిచారు.అయితే ఇదంతా చంద్రబాబు విజన్ వల్లే సాధ్యం కాబట్టి వారి పొగడ్తలు కూడా చంద్రబాబుకే దక్కుతాయి.కాగా వీరు గతంలో వైజాగ్ లో ఆడటానికి వచ్చినప్పుడుకి ఇప్పుడు పరిస్థితిలో మార్పు ఉందనడంలో తప్పే లేదు.కాని ఎక్కడైనా ప్రక్రుతి వైపరిత్యాలు సంభవిస్తే పరిస్థితి దిగజారిద్ది కాగ వైజాగ్ దానికి విరుద్ధంగా రెండింతలు అభివృద్ధి చెందటం విచిత్రం.

whatsapp-image-2016-10-28-at-12-33-34-pm

whatsapp-image-2016-10-28-at-12-33-58-pm

Leave a Reply