టీమిండియా ఓపెనర్‌కు సర్జరీ! 2 నెలలపాటు క్రికెట్‌కు దూరం

టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ రెండు నెలలపాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడుతున్న రోహిత్ 6 నుంచి 8 వారాలపాటు మ్యాచ్‌లు ఆడేందుకు అందుబాటులో ఉండడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్‌లో 70 పరుగులతో ఆకట్టుకున్న రోహిత్ 46 పరుగుల వద్ద ఉండగా తొడ కండారాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. మైదానంలోనే ట్రీట్‌మెంట్ తీసుకుని బ్యాటింగ్ కొనసాగించాల్సి వచ్చింది.

ఈ కారణంగా ఇంగ్లండ్‌తో నవంబర్ 9 నుంచి జరగనున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అయితే తర్వాత జరగబోయే వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి. అవసరమైతే రోహిత్‌కు సర్జరీ జరగొచ్చని ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ఒకవేళ సర్జరీ జరిగితే మరిన్ని రోజులు రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వనున్నామని చెప్పారు. కివీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రోహిత్ మూడు అర్ధ శతకాలను నమోదు చేశాడు.

Leave a Reply