ఆ సీన్ చూశాక బాలయ్యను విదేశీయులు రియల్‌ హీరో అన్నారట

ఆ సీన్ చూశాక బాలయ్యను విదేశీయులు రియల్‌ హీరో అన్నారట

ఆ సీన్ చూశాక బాలయ్యను విదేశీయులు రియల్‌ హీరో అన్నారట : నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్రశాతకర్ణి’ సినిమా షూటింగ్‌లో కొంతభాగం మొరాకోలో జరిగిన విషయం తెలిసిందే. అక్కడ శాతకర్ణి తన బిడ్డ పులోమావిని తీసుకుని యుద్ధానికి బయల్దేరే సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఓ ప్రమాదం జరిగిందట. బాలయ్య ఓ పసిబిడ్డను ఎత్తుకుని గుర్రంపై వెళ్తుండగా చుట్టూ అగ్నిగోళాలు మండుతూ ఉంటాయట.

అయితే గుర్రం కొంచెం ముందుకెళ్లాక ఓవైపున్న అగ్నిగోళాలు పేలడంతో.. గుర్రం హఠాత్తుగా పక్కకి తిరిగిపోయిందట. దీంతో గుర్రంపైనున్న బాలయ్య కిందపడిపోయారట. అయితే చేతిలో పసివాడు ఉండడంతో.. ఆ బిడ్డకు ప్రమాదం జరగకుండా కవచంలా మారిపోయారట. తనకి తగిలిన దెబ్బలను పట్టించుకోకుండా బిడ్డ గురించి ఆందోళన చెందారట. బిడ్డకేం జరగలేదని తెలుసుకుని అరగంట విశ్రాంతి తీసుకుని మళ్లీ షూటింగ్‌కు హాజరయ్యారట. ఆ దృశ్యాన్ని చూసిన విదేశీయులు మీ హీరో రియల్‌ హీరో అని ప్రశంసించారట.

Leave a Reply