కాఫీతో మొబైల్‌ చార్జింగ్

కాఫీతో మొబైల్‌ చార్జింగ్

పని ఒత్తిడి నుంచి సేద తీరేందుకు చాలామంది ఎంచుకునే మార్గం కాఫీ. కాఫీతో పాటు మొబైల్‌లో చాట్‌ చేయడం, గేమ్స్‌ ఆడడం కూడా రిలాక్సింగ్‌గానే ఉంటుంది. అందుకే గంటకో కాఫీ తాగేవాళ్లు, నిమిషానికోసారి మొబైల్‌ చూసుకునేవాళ్లు చాలామంది ఉంటారు మనచుట్టూ. వేడి వేడి కాఫీ మన మైండ్‌ను రిఫ్రెష్‌ చేసినట్టే అది మొబైల్‌ను కూడా చార్జ్‌ చేస్తే ఎలా ఉంటుంది? ఆ ఆలోచన నుంచి ఆవిష్కరించిందే ఈ ‘కాఫీ మగ్‌ ఫోన్‌ చార్జర్‌’ (coffee mug phone charger).. ఒక చిన్న మూతలా… కప్పు స్టాండ్‌లా ఉండే దీనిపై టీ లేదా కాఫీ కప్పును ఉంచితే ఆ ద్రవ పదార్థం నుంచి వేడిని గ్రహించి కింద ఉన్న పిన్‌ ద్వారా మొబైల్‌ చార్జ్‌ అవుతుంది. ఈ గాడ్జెట్‌కు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉంది.

Leave a Reply