చిరుకు కోపం తెప్పించిన పవన్ ఫ్యాన్

చిరుకు కోపం తెప్పించిన పవన్ ఫ్యాన్

చిరుకు కోపం తెప్పించిన పవన్ ఫ్యాన్ :  చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ నెం.150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ హాయ్‌ల్యాండ్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఎంత అట్టహాసంగా జరిగిందో అంతకంటే ఎక్కువ వివాదాలకు కేరాఫ్‌గా మారింది. అల్లు అర్జున్ పరోక్ష హెచ్చరికలు, మెగా బ్రదర్ నాగబాబు తిట్లతో వేదికపై కాక పుట్టించారు. ఇంతకన్నా మంచి సందర్భం రాదనుకున్నారో ఏమో మనసులో దాచుకున్నదంతా వెళ్లగక్కారు. అయితే ఈ ఈవెంట్‌లో జరిగిన ఓ ఘటన చిరంజీవికి కోపాన్ని, ఒకింత చికాకును తెప్పించింది. మొదటి నుంచి అనుకుంటున్నట్లు గానే ఈ వేడుకకు వేలమంది మెగా ఫ్యాన్స్ హాజరయ్యారు. పవన్ ఫ్యాన్స్ కూడా వచ్చారు. చిరంజీవి మాట్లాడుతున్న సమయంలో వేదికకు అతి సమీపంలో ఉన్న ఓ పవన్ అభిమాని బాగా ఇబ్బంది పెట్టాడు. చేతిలో ఉన్న జనసేన జెండాను ఊపుతూ కనిపించాడు. పవర్‌స్టార్, పవర్‌స్టార్ అంటూ నినాదాలు చేశాడు. ఈ దృశ్యం చిరు కంట పడింది. వెంటనే మాట్లాడటం ఆపేసి జెండా కిందకు దించాలని హెచ్చరించాడు.

మెగాస్టార్ చూశాడనో ఏమో ఆ పవన్ అభిమాని మరింత రెచ్చిపోయాడు. ఇంకాస్త ఎక్కువగా జెండాను గాల్లోకి లేపుతూ నానా హంగామా సృష్టించాడు. మరోమారు మెగాస్టార్ హెచ్చరించాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరికి చేసేదేమీ లేక చిరంజీవి స్పీచ్‌ను కొనసాగించి ముగించాడు. ఈ ఒక్క అభిమాని చేతిలోనే కాదు వేడుకకు వచ్చిన చాలామంది చేతుల్లో జనసేన జెండాలు కనిపించాయి. పవన్ అభిమానులు చిరంజీవికి పెద్ద తలనొప్పిగా మారారని సినీ జనం మాట్లాడుకుంటున్నారు.

Leave a Reply