ట్రంప్ టార్గెట్ ఒబామా

ట్రంప్ టార్గెట్ ఒబామా

ట్రంప్ టార్గెట్ ఒబామా : ఎన్నికల సమయంలో ఒబామా విధానాలకు తీవ్రంగా తప్పుబట్టిన ట్రంప్.. అమెరికా అధ్యక్షుడయ్యాక మొత్తం పాలనా ప్రక్రియనే మార్చేయబోతున్నారని ఆయన టీమ్ చెబుతోంది. మొదటి రోజు నుంచే ఒబామా విధానాలకు వ్యతిరేకంగా పెద్ద నిర్ణయాలు తీసుకుంటారట. ఎందుకంటే ఒబామా పాలసీతో పక్కవాళ్లే బాగుపడతారని ట్రంప్ భావన.

ఒబామా నిర్ణయాల కారణంగానే ఉద్యోగాలు విదేశాలకు వెళ్లిపోయాయని, ఆర్థిక వృద్ధి తగ్గిపోయిందని ట్రంప్ అభిప్రాయం. అంతర్జాతీయ వేదికలపై కూడా ఒబామా సరిగా వ్యవహరించడం లేదన్నది ట్రంప్ కంప్లైంట్. అందుకే అమెరికా గ్రేట్ ఎగైన్ అవ్వాలంటే.. కఠిన నిర్ణయాలు తప్పవని చెబుతున్నారు ట్రంప్.

వాణిజ్యం, ఉద్యోగాల కల్పన, పన్ను సంస్కరణలు.. ఇలా కీలక అంశాలు అన్నింటిలోనూ ఒబామాతో ట్రంప్ కు తీవ్రమైన విభేదాలున్నాయి. ఈ నెల 20న అమెరికా పీఠం ఎక్కుతున్న ట్రంప్.. ఆరోజు నుంచే మార్పులు మొదలుపెడతారట. గతంలో ఏ అధ్యక్షుడు చేయనంత విప్లవాత్మకంగా.. పాత అధ్యక్షుడి నిర్ణయాలన్నీ రద్దుచేస్తారట.

ట్రంప్ విధానాలు నిజంగా అమలౌతాయా అని ఆలోచిస్తున్న కొంతమందికి.. ఈ ప్రకటన కొత్త ఉత్సాహాన్నిచ్చింది. కానీ అన్ని విధానాలు మార్చడం సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే అమెరికా పేరు చెడిపోతుందనేది నిపుణుల మాట. అటు ఈ నెల 10న తన వీడ్కోలు ప్రసంగంలో ఒబామా ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది

Leave a Reply