తండ్రికని స్పెషల్ ఫ్లైట్లో రప్పించిన సీఎం

తండ్రికని స్పెషల్ ఫ్లైట్లో రప్పించిన సీఎం

తండ్రికని స్పెషల్ ఫ్లైట్లో రప్పించిన సీఎం : టీవీలో సీరియల్స్ సంవత్సరాల తరబడి సాగుతాయని మనకు తెలుసు. కానీ ఇక్కడ పార్టీల్లో గొడవలు కడా నానుతూనే ఉన్నాయి. రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న యూపీలో వివాదం కొనసాగుతోంది. సమాజ్ వాదీ పార్టీలో విభేదాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేపుతున్నాయి.

మొదట తమ్ముడి మాట విని అఖిలేష్ ను పార్టీ నుంచి బహిష్కరించిన ములాయం.. తర్వాత అతడి శక్తిని గుర్తించి తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. అయితే అఖిలేష్ మాత్రం తండ్రికి ఛాన్సివ్వకుండా తనను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక చేయించుకున్నారు. దీంతో మరోసారి అలిగిన ములాయం ఢిల్లీలో ఈసీని కలిశారు.

చీలిక ఖాయమనుకుంటున్న తరుణంలో.. మళ్లీ అఖిలేష్ తండ్రికి ఫోన్ చేశారు. అఖిలేష్ ఫోన్ రాగానే స్పెషల్ ఫ్లైట్లో లక్నో వచ్చిన ములాయం.. ఎవర్నీ కలవకుండా నేరుగా అఖిలేష్ ఇంటికి వెళ్లారు. అసలు తండ్రీకొడుకుల గూడపుఠాణీ ఏంటో అర్థంకాక అందరూ తల బద్దలు కొట్టుకుంటున్నారు.

అయితే ఈ భేటీ వెనుక ఆజం ఖాన్ ఉన్నట్లు తెలుస్తోంది. తండ్రీకొడుకులు తప్పకుండా ఒక్కటవుతారని ఆయన చెబుతున్నారు. కానీ ఫోన్ కాల్ కు కారణమైన ఆజం ఖాన్ కు ముఖం కూడా చూపించని ములాయం.. నేరుగా అఖిలేష్ దగ్గరకు వెళ్లడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

Leave a Reply