ధోనీ కోసం గవాస్కర్ ధర్నా

ధోనీ కోసం గవాస్కర్ ధర్నా

సాధారణంగా ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆరోపిస్తాయి. కానీ ఇక్కడ లెజెండరీ క్రికెటర్ ధర్నా చేస్తానంటున్నారు. ఆయనెవరో కాదు సునీల్ గవాస్కర్. అది కూడా ధోనీ కోసం.

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై గవాస్కర్ తనదైన శైలిలో స్పందించారు. ధోనీ కెప్టెన్సీ నుంచి మాత్రమే తప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్న గవాస్కర్.. అదే రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగేవాడినని చమత్కరించారు.

ధోనీలో చాలా క్రికెట్ దాగి ఉందన్న గవాస్కర్.. అతడు అప్పుడే రిటైర్ అయితే తీవ్ర నిరాశచెందేవాడ్నంటున్నారు. ఓ ఆటగాడిగా భారత్ కు ధోనీ సేవలు అవసరమన్నారు గవాస్కర్. టీమిండియా మెంబర్ గా ధోనీ కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ధోనీ టీమ్ భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాడన్న గవాస్కర్.. ధోనీని కోహ్లీ బాగా ఉపయోగించుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో.. ఇక బ్యాటింగ్, కీపింగ్ లో సత్తా చాటుతాడని భావిస్తున్నారు. గవాస్కర్ మాటలతో ధోనీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply