నోకియా ఈజ్‌ బ్యాక్‌

నోకియా ఈజ్‌ బ్యాక్‌

నోకియా ఈజ్‌ బ్యాక్‌ : స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లోకి నోకియా మళ్లీ ప్రవేశించింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో కూడిన నోకియా 6 మొబైల్‌ను చైనా మా ర్కెట్లోకి విడుదల చేసినట్టు నోకియా బ్రాండ్‌ హక్కులు కలిగిన ఫిన్లాండ్‌ కంపెనీ హెచ్‌ఎండి గ్లోబల్‌ ఆదివారంనాడు ప్రకటించింది. దీని ధర 1,699 యువాన్లు (సుమారు రూ.16,000). చైనా ఇ-కామర్స్‌ పోర్టల్‌ జెడిడాట్‌కామ్‌ ద్వారా అమ్మకాలను మొదలుపెడుతున్నట్టు పేర్కొం ది. త్వరలోనే అన్ని మార్కెట్లలోనూ ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. నోకియా 6లో ఆండ్రాయిడ్‌ 7.0 నౌగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి డిస్‌ప్లే, 2.5డి కర్వ్‌డ్‌ గ్లాస్‌, డ్యూయల్‌ సిమ్‌, 4జిబి రామ్‌, 64 జిబి ఇంటర్నల్‌ మెమరీ, 16 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఏడాదిలో నోకియా బ్రాండ్‌తో ఆరు నుంచి 7 ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయాలని హెచ్‌ఎండి గ్లోబల్‌ యోచిస్తోంది.

Leave a Reply