రాంపూర్ రాణి రిటర్న్స్

రాంపూర్ రాణి రిటర్న్స్

రాంపూర్ రాణిగా పేరు తెచ్చుకున్న జయప్రద మళ్లీ ఎస్పీ వైపు చూస్తున్నారా. కష్టకాలంలో నేతాజీకి అండగా నిలుస్తున్నారా.. అవుననే అంటుతున్నాయి తాజా పరిణామాలు. ములాయం ఇంట్లో ఏర్పాటుచేసిన కీలక భేటీకి అమర్ సింగ్ తో పాటు జయప్రద కూడా వచ్చారు.

కొన్నాళ్లుగా సమాజ్ వాదీ పార్టీకి దూరంగా ఉన్న జయప్రద వివిధ పార్టీల్లో చేరడానికి ట్రై చేశారు. గత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిక ఖాయమైందని ప్రచారం జరిగింది. కానీ ఎందుకో చివరి నిమిషంలో జయప్రద వెనక్కితగ్గారు. ఇప్పుడు మళ్లీ ములాయం ఇంట్లో వాలిపోయారు.

మొదట్నుంచి అమర్ సింగ్ తో జయప్రదకు మంచి అనుబంధం ఉంది. ఆయన్ను గురువుగా, మార్గదర్శకుడిగా భావిస్తారు. ఏపీలో టీడీపీ నుంచి యూపీలో ఎస్పీకి వెళ్లడానికి జయకు అమర్ సింగే హెల్ప్ చేశారు. అప్పట్నుంచి జయ గుడ్డిగా అమర్ సింగ్ ను ఫాలో అయిపోతున్నారు.

ఇప్పుడు అమర్ సింగ్ మళ్లీ ములాయంకు దగ్గరవడం, అటు అఖిలేష్ కూడా దూరం జరగడంతో.. ఇదే మంచి సమయమని జయప్రద ములాయం ఇంటికి వచ్చారు. పార్టీలో సంక్షోభం నెలకొన్న సమయంలో వచ్చిన జయప్రద ఎలాంటి పాత్ర పోషిస్తారో ఎవరికీ అంతుబట్టడం లేదు. అంతా అయిపోయాక ములాయం ఆమెకు ఏం చేయగలుగుతారని ఎస్పీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

Leave a Reply