లక్షన్నర మంది విద్యార్థులు బోగస్‌…ప్రభుత్వ బడుల్లో జరుగుతున్న బాగోతం ఇదే

లక్షన్నర మంది విద్యార్థులు బోగస్‌…ప్రభుత్వ బడుల్లో జరుగుతున్న బాగోతం ఇదే

పిల్లల్లేరు.. కానీ, మధ్యాహ్న భోజనం ఖర్చయిపోయింది! పుస్తకాలు, యూనిఫారాలు ఖర్చు రాసేశారు! కొన్నేళ్లుగా సాగిన బాగోతమిది! ఇది ఇప్పుడు నిజమని నిర్ధారణ అయింది. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో లక్షన్నరకుపైగా బోగస్‌ ఎనరోల్‌మెంట్‌ జరిగింది. విద్యార్థులకు ఆధార్‌ తప్పనిసరి చేయడంతో ఈ బండారం బట్టబయలైంది. యూ డైస్‌, చైల్డ్‌ ఇన్ఫో స్టూడెంట్‌ ఎనరోల్‌మెంట్‌ లెక్కల మధ్య భారీ వ్యత్యాసం బోగ్‌సను నిర్ధారిస్తోంది. గత విద్యా సంవత్సరం యూ డైస్‌ లెక్కల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లలో 24,12,084 మంది విద్యార్థులు ఉన్నట్లు విద్యా శాఖ సమాచారాన్ని సేకరించింది. ఈ సమాచారాన్ని మాన్యువల్‌గానే సేకరించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఏటా విద్యా పథకాలకు నిధులు కేటాయిస్తుంది. అందులో మధ్యాహ్న భోజనం, యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలతోపాటు, ఎస్‌ఎ్‌సఏ, ఆర్‌ఎంఎ్‌సఏ పథకాల ద్వారా నిధులు కేటాయిస్తుంది. ఈ నేపథ్యంలోనే, విద్యార్థుల కచ్చితమైన ఎనరోల్‌మెంట్‌ కోసం కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఆధార్‌ నంబరును తప్పనిసరి చేసింది. దాంతో, చైల్డ్‌ ఇన్ఫో ద్వారా సేకరించే సమాచారంలో రాష్ట్ర విద్యా శాఖ ఆధార్‌ నెంబర్‌ను తప్పనిసరి చేసింది. గత ఏడాది నవంబరు నుంచి చైల్డ్‌ ఇన్ఫో ద్వారా విద్యార్థుల సంఖ్యను నమోదు చేసింది. ఇందుకు డిసెంబరు 31 వరకు గడువు ఇచ్చింది. నిర్ణీత గడువులోగా చైల్డ్‌ ఇన్ఫోకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్ల నుంచి 22,26,594 మంది విద్యార్థుల సమాచారం వచ్చింది. వారంతా తమ ఆధార్‌ నెంబర్‌ను వెబ్‌సైట్‌కు అప్‌లోడ్‌ చేశారు. యూ డైస్‌, చైల్డ్‌ ఇన్ఫో ఎనరోల్‌మెంట్‌ మధ్య 1,85,490 మంది విద్యార్థులు లెక్క తేడా వచ్చింది. ఇదంతా బోగస్‌ ఎన్‌రోల్‌మెంట్‌గా స్పష్టమవుతోంది. అయితే, గడువు ముగిసినా, కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక లోపాలు తలెత్తినట్లు విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. వారికి మరో వారం రోజులపాటు సమాచారం అప్‌లోడ్‌ చేసేందుకు అవకాశం ఇచ్చారు. తుది గడువు ముగిసినా, మరో 15 నుంచి 20 వేల మంది విద్యార్థుల కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం లేదు. దాంతో, ప్రభుత్వ స్కూళ్లలో లక్షా యాబై వేలకుపైగా బోగస్‌ ఎనరోల్‌మెంట్‌ నమోదైనట్లు విద్యా శాఖ ఒక అంచనాకు వచ్చింది. ఇందులో ప్రధానంగా ఉమ్మడి మహబూబ్‌ నగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, మెదక్‌, నల్లగొండ జిల్లాల్లో బోగస్‌ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. కాగా, చైల్డ్‌ ఇన్ఫో ద్వారా సేకరించిన విద్యార్థుల సంఖ్య ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు (పీఏబీ) రాషా్ట్రనికి రావాల్సిన నిధులను కేటాయిస్తుంది.

Leave a Reply