శాతకర్ణిపై బన్నీ ‘సంక్రాంతి కామెంట్’!

శాతకర్ణిపై బన్నీ ‘సంక్రాంతి కామెంట్’!

నేటి తరం హీరోల్లో బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. వరుస సక్సెస్‌లతో మంచి జోరు చూపిస్తున్నాడు అల్లు అర్జున్. సరైనోడు తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో డీజే-దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తున్నాడు. ఇటీవలే బన్నీకి కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. ఆ ఆనందంలోనే మునిగి తేలుతున్నాడు ప్రస్తుతం అతడు. తాజాగా ఓ సిమెంట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఎంపికయ్యాడు. ఆ సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు మంగళవారం వైజాగ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. అక్కడ తనను కలిసిన కొందరు అభిమానులతో బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా గురించి పరోక్షంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150 గురించి అడిగిన అభిమానులతో.. ‘ఈ సారి సంక్రాంతి మనదే’ అని వ్యాఖ్యానించినట్టు టాక్. ఆ మాట నందమూరి ఫ్యాన్స్‌కి తెలియడంతో.. అంటే బాలకృష్ణ శాతకర్ణి సినిమా కన్నా ఖైదీ నంబర్ 150నే సూపర్ హిట్ అన్న అర్థంలోనే బన్నీ ఆ వ్యాఖ్యలు చేశాడని అనుకుంటున్నారు. దీంతో బన్నీపై నందమూరి అభిమానులు మరింత పదునైన వ్యాఖ్యలను ఎక్కు పెట్టేందుకు సిద్ధమవుతున్నారట. కాగా, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను డైరెక్ట్ చేస్తున్న క్రిష్.. సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా ‘ఖబడ్దార్’ అన్న పదాన్ని వాడాడు. దానిపై అతడు వివరణ ఇచ్చినా.. బన్నీ ఎందుకు ఇలాంటి కామెంట్ చేయాల్సి వచ్చిందని నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారట. కాగా, అంతకు ముందు కూడా పవన్ కల్యాణ్‌నుద్దేశించి ‘చెప్పను బ్రదర్’ అని బన్నీ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యతో బన్నీ.. కొంత పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైన విషయమూ తెలిసిందే. మరి తాజా కామెంట్ ఎంత వరకు దారితీస్తుందో చూడాలి.

Leave a Reply