సింగపూర్లో శాతకర్ణి న్యూ ఇయర్

సింగపూర్లో శాతకర్ణి న్యూ ఇయర్

ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకలకు చాలామంది టాలీవుడ్ సెలబ్రెటీలు గోవాను వేదికగా ఎంచుకున్నారు. కొందరు హైదరాబాద్ లోనూ ఉంటూ నూతన సంవత్సరాదిని ఆస్వాదించారు. ఐతే నందమూరి బాలకృష్ణ మాత్రం న్యూ ఇయర్ బాష్ కోసం భిన్నమైన వేదికను ఎంచుకున్నారు. ఆయన సింగపూర్లో తన కుటుంబంతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. బాలయ్య భార్య.. ఇద్దరు కూతుళ్లుతో పాటు కొడుకు మోక్షజ్న కూడా ఆయన వెంటే ఉన్నట్లు సమాచారం. దాదాపు ఆరు నెలలుగా బాలయ్య విరామం లేకుండా పని చేస్తున్నాడు.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి భారీ చిత్రాన్ని కొన్ని నెలల్లోనే పూర్తి చేయడంలో బాలయ్య కష్టం ఎంతో ఉంది. మరోవైపు తెలుగుదేశం ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ పనుల్లోనూ బిజీ బిజీగా గడిపాడు బాలయ్య. ఈ నేపథ్యంలో కొన్ని రోజలు సింగపూర్లో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నాడు బాలయ్య. ఐతే బాలయ్య సింగపూర్ కే వెళ్లడం వెనుక చంద్రబాబుకు ఈ నగరంతో ఉన్న ప్రత్యేక అనుబంధం కూడా కారణం కావచ్చని అంటున్నారు. సింగపూర్ నుంచి తిరిగి వచ్చాక వారం రోజుల పాటు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రమోషన్లలో పాల్గొనబోతున్నాడు బాలయ్య. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Leave a Reply