హీరో నాని కూడా మొదలెట్టేశాడు బాబోయ్

హీరో నాని కూడా మొదలెట్టేశాడు బాబోయ్

ఒకప్పుడు సినిమా ప్రమోషన్ అంటే ఆడియో ఫంక్షన్స్, ప్రెస్ మీట్ల హడావుడి ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆడియో ఫంక్షన్స్‌తో పాటు ఆ పాటల ప్లాటినమ్ ఫంక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ మధ్య ఇది కూడా మారింది. అన్ని పాటలూ ఒకేసారి విడుదల చేస్తే సినిమాకు సరిగ్గా ప్రమోషన్ జరగదనో ఏమో ఒక్కో పాటను విడుదల చేస్తూ సరికొత్త పబ్లిసిటీ స్టంట్‌కు తెరలేపారు టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు. ఈ ఒక్కో పాట సిద్ధాంతాన్ని ఎవరు కనిపెట్టారో కానీ చాలామంది హీరోలు ఈ మధ్య ఇదే ఫాలో అవుతున్నారు. నేచులర్ స్టార్ నాని కూడా దీన్నే మార్గంగా ఎంచుకున్నాడు.

నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నేను లోకల్’. దిల్‌రాజు నిర్మాతగా, దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా పాటలను ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి పాట ‘నెక్ట్స్ ఏంటి’ అనే బాణీలో సాగుతుందట. ఈ పాటను జనవరి 6న సాయంత్రం 6గంటలకు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు నాని తన ఫేస్‌బుక్ పేజ్ ద్వారా తెలియజేశాడు. చిరంజీవి నటించిన ఖైదీ నెం.150 సినిమా పాటలు కూడా ఒక్కొక్కటిగా యూట్యూబ్ ద్వారా విడుదలైన సంగతి తెలిసిందే.

Leave a Reply